ఏపీలో రాష్ట్రపతి.. ప్రతిష్ఠాత్మక ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్ ప్రారంభం | Oneinda Telugu

2017-12-26 1

President Ram Nath Kovind will launch Andhra Pradesh Fiber grid project on 27 December at AP Secretariat in Amaravati. AP Fiber grid is a prestigious project initiated by AP Chief Minister Nara Chandrababu Naidu to give high speed internet at as low as 149 rupees per month.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫైబర్‌ గ్రిడ్‌ను రాష్ట్రపతి కోవింద్‌ రేపు వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబునాయుడు తో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

అయితే కోవింద్‌ తొలుత నాగార్జున యూనవర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన ఎకనామిక్‌ సదస్సులో పాల్గొంటారు అనంతరం వెలగపూడిలో సచివాలయానికి చేరుకుంటారు. 11.45కు సచివాలయంలో ఏర్పాటుచేసిన ఏపీ ఫైబర్‌గ్రిడ్‌, ఏపీ సర్వైలెన్స్‌ ప్రాజెక్టు, డ్రోన్‌ ప్రాజెక్టు లను రాష్ట్రపతి జాతికి అంకితమిస్తారు. ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం అనంతరం ఒక ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వినియోగదారులతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత సచివాలయంలో ఒకటో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ పనితీరును రాష్ట్రపతి పరిశీలిస్తారు. ఈ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా రాష్ట్రపతికి వివరిస్తారు.